శాకాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మాంసాహారం వద్దు శాకాహారం ముద్దు అంటూ కోదాడలో శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పిరమిడ్ ధ్యానులు,శాఖాహారులు పట్టణంలో శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ మాంసాహారం వల్ల కలిగే నష్టాలను తెలుపుతూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ కరపత్రాలను పంచారు. జీవ హింస వద్దు శాకాహారం ముద్దు మానవులంతా ఆరోగ్యంగా ఉండాలంటే శాకా హారం తీసుకోవాలన్నారు.అదేవిధంగా ధ్యానం తోనే మనసుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షులు కాటేపల్లి నరసింహారావు న్యాయ సలహాదారులు బండారు రమేష్ బాబు సెక్రటరీ చంద్రకాంత్ జాయింట్ సెక్రటరీ పి.సత్యనారాయణ రెడ్డి కోశాధికారి. పైడిమర్రి. శ్రీనివాసరావు సభ్యులు జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.