కోదాడ మండలంలోని యర్రవరంలో కొలువైన శ్రీబాలా ఉగ్ర నరసింహస్వామి దర్శనానికి భక్తుల సౌకర్యార్థం సోమవారం నుండి ఉదయం 5 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతీ 30 నిమిషాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష ఆదివారం తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ యంజిబిఎస్ నుండి యర్రవరం భక్తుల కొరకు బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.