మున్నూరు కాపు సంఘం మునగాల గ్రామ శాఖ అధ్యక్షునిగా తాటికొండ సురేష్ ను ఆసంఘ నాయకులు ఎన్నుకున్నారు.ఆదివారం మండలం కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు.సమావేశంలో కార్యాచరణ కమిటీ ఎన్నిక,వంగవీటి రంగా విగ్రహ ప్రతిష్ట స్మశాన వాటిక పునరుద్ధరణ, వంటి అంశాలపై చర్చించిన అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో గౌరవాధ్యక్షులుగా కాసర్ల రంగన్న గంధం అంజయ్య సలహాదారులుగా పరమాత్మల సత్యనారాయణ కుందూరు నరసయ్య ఉపాధ్యక్షులుగా పసుపులేటి గోపి గంధం సైదులు ప్రధాన కార్యదర్శిగా శెట్టి గిరి కోశాధికారిగా శాఖమూడి అప్పారావు ప్రచార కార్యదర్శిగా తన్నీరు ఉపేందర్ తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఎన్నిక అనంతరం అధ్యక్షులు తాటికొండ సురేష్ మాట్లాడుతూ గ్రామంలో సంఘ అభివృద్ధికి కుల పెద్దల సలహాలను పాటిస్తూ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కాసర్ల కోటేశ్వరరావు మున్నూరు కాపు సంఘ మండల అధ్యక్షులు నాయిని అంజిబాబు సంఘ నాయకులు కాసర్ల వెంకట్ రాజేష్ తన్నీరు ప్రసాద్ శాఖ ముడి సత్యం చిన్న కుందూరు అప్పారావు పసుపులేటి వెంకటేశ్వర్లు గంధం రవి గంధం ప్రసాద్ పసుపులేటి సందీప్ కుందూరు సీతారామయ్య కూరాకుల బిక్షం తదితరులు పాల్గొన్నారు.