దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ
Suryapetదేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ కోదాడ మండలం గుడిబండ రైతు వేదిక పరిధిలోని రైతులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ…..రైతాంగాన్ని ఆగం చేసిందే ఆ పార్టీ దుష్టఖ పాలన, వారి పాలనలో సాగునీరు కాదు కదా, కనీసం తాంగేందుకు కూడా నీళ్ళు లేని దుస్థితి అని అన్నారు. కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారిగ పాలనలో అంతా రైతు ఆత్మహత్యలు లేనని ఆయన అన్నారు.కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శించారు. పైగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనమని మండి పడ్డారు. ఇలాంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని చెప్పారు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బిఆర్ ఎస్ శ్రేణులకు, రైతులకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి,జడ్పీటీసీ కృష్ణకుమారి శేషు , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అనంత సైదయ్య, వైస్ ఎంపీపీ రాణి బ్రహ్మయ్య,సొసైటీ చైర్మన్ రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, రైతు సంఘాల నాయకులు, పార్టీ నాయకులు సొసైటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.