మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష సంఘటన సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేసిందని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు పడిశాల రఘు,శనివారం కోదాడ పట్టణంలో ఒక పత్రికా ప్రకటన లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.నాగరిక సమాజంలో ఇది అత్యంత అవమానకర ఘటన అని పేర్కొన్నారు.ఈ అమానుషం యావత్ దేశాన్నే తలదించుకునేలా చేసిందన్నారు. ఈ ఘటనతో తోటి భారతీయుడిగా సిగ్గు పడుతున్నా' అని రఘు ఆవేదన వ్యక్తం చేశారు.ఘటనకు బాధ్యులైన అసాంఘిక శక్తులను వెంటనే ఉరితీయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు