కులవృత్తుల నిధులు విడుదల చేయాలి.
Hyderabadహైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య, మాట్లాడుతూ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష రూపాయల ఆర్థిక పథకంలో ప్రజా ప్రతినిధుల జోక్యం తగ్గించాలని ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి అర్హత కలిగిన వృత్తిదారులందరికీ ఆర్థిక సహకారం అందించి ప్రభుత్వ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆశయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేపర్ ప్రచారం బాగాచేస్తూ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే పద్ధతిని మార్చుకోవాలని లేనియెడల వృత్తిదారులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆశయ్య హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థల్లో వృత్తిపని కాంట్రాక్టుకు వెంటనే విధి,విధానాలు ఇవ్వాలి స్థానిక రజక సొసైటీలకే వృత్తి పని అప్పగించాలని కోరారు. ఈ సందర్భంగా 50 ఏళ్లు నిండిన రజక వృత్తిదారులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, గృహలక్ష్మీ పథకాన్ని 5లక్షలు పెంచి వృత్తి దారుల అందరికీ ఇవ్వాలని, రజకులపై జరుగుతున్న సామాజిక దాడుల అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని రాష్ట్ర కమిటీ తీర్మానించిందని తెలిపారు. పై తీర్మానాల సాధన కోసం భవిష్యత్తులో దశల వారి ఆందోళనలు చేస్తామని రాష్ట్ర కమిటీ నిర్ణియించిందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ, సి మల్లేష్, జ్యోతి ఉపేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు అన్నారపు వెంకటేశ్వర్లు, ఎదునూరి మదర్,పాయిరాల రాములు,కోట్లు నవీన్ కూమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సుభద్ర,వెంకటస్వామి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.