స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిలుపూర్ మండలంలో బిజెపి పార్టీ కి చెందిన మండల ఉపాధ్యక్షుడు భోగం శ్రీనివాస్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు భోగం లావణ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిరువురికి కడియం శ్రీహరి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగామ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి,సర్పంచ్ కొంగర రవి,ఉప సర్పంచ్ బబ్బుల వంశీ,గ్రామ శాఖ అధ్యక్షుడు వెన్న మాధవరెడ్డి వార్డు మెంబర్ భోగం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు