నేడు కామ్రేడ్ నరసింహారెడ్డి 32వ వర్ధంతి సభ
Jangaonఈనెల 28 శుక్రవారం రోజున వైష్ణవి గార్డెన్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు జనగామ మాజీ ఎమ్మెల్యే సిపిఎం జనగామ ఉద్యమ నిర్మాత అమరజీవి కామ్రేడ్ ఏసిరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి సభ జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రజలకు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బేస్తవారం రోజున పార్టీ కార్యాలయంలో జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కనుక రెడ్డి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సామాజిక అణచివేత వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎస్ రెడ్డి గారు
ముఖ్య భూమిక పోషించాలన్నారు. సాయుధ పోరాట అనంతరం జనగామ ప్రాంతంలో సిపిఎం పార్టీ ఉద్యమ నిర్మాతగా ఉండి ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు జనగామ శాసనసభ్యులు ఎన్నికై జనగామ ప్రాంత అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించడం జరిగిందన్నారు. చనిపోయే నాటికి రెండు జతల బట్టలు తప్ప ఎలాంటి ఆస్తులు లేని మహా నాయకుడు ఎస్ రెడ్డి
ప్రజలే తన బిడ్డలుగా భావించి ప్రజల కోసం పనిచేయడం జరిగింది. నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడం కాకుండా జనగామ ప్రాంతానికి సాగు తాగుడు అందించాలని దానికోసం ఎస్సారెస్పీ రెండవ దశ ద్వారా ఈ ప్రాంతానికి సాగు తాగుతాను అందించాలని పోరాటం చేయడం జరిగిందన్నారు ఈ పోరాటం కొనసాగింపులో భాగంగా జనగామ ప్రాంతానికి సిపిఎం నిర్వహించిన ప్రజా ఉద్యమాల ఫలితంగా దేవాదాల ప్రాజెక్టు రావడం జరిగిందన్నారు అభివృద్ధికి ఎంతో కీలకపాత్ర పోషించిన మహనీయుడు నరసింహారెడ్డి గారు 32 వ వర్ధంతిసభ నిర్వహించడం జరుగుతుందని ఈ సభను జయప్రదం చేయాలని పార్టీ కార్యకర్తలకు పార్టీ అభిమానులు ప్రజల్ని కోరడం జరిగింది . కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు సాంబరాజు యాదగిరి అహల్య జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి సుంచు విజేందర్