ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి.
Suryapetభారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా విజయీభవ ట్రస్ట్, స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు అని రాష్ట్రపతిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకుని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలామ్ అని అన్నారు విద్యతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తను చనిపోయే చివరి రోజు వరకు విద్యార్థులకు విద్యను బోధిస్తూ వారి తుది శ్వాస విడిచారని ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించారు నేటి యువత డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, విజయీభవ ట్రస్ట్ అధ్యక్షులు చారుగండ్ల రాజశేఖర్, స్వర్ణభారతి ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ షేక్ రహీం,బడుగుల సైదులు, పందిరి సత్యనారాయణ,పందిరి.రఘు, గోపాల్,బొగ్గారపు రామ్మూర్తి, సాయి, పైడిమర్రి రామారావు తదితరులు పాల్గొన్నారు