జీవో నెంబర్ 46 ను రద్దు చేయాలి
Suryapetతెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ నియామకల్లో కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 46 ను వెంటనే రద్దు చేసి రాష్ట్రమంతటా పాత పద్ధతిలో కానిస్టేబుల్ నియామకాలు చేపట్టి గ్రామీణ ప్రాంత కానిస్టేబుల్ అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని లేని పక్షంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని.మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ మండల కేంద్రము లో పత్రికా ప్రకటనలో తెలిపారు.హైదరాబాద్,రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి జిల్లాల వారికి 53% రిజర్వేషన్ కల్పించి మిగతా జిల్లాల వారికి 47% కేటాయించడంతో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ప్రస్తుత కానిస్టేబుల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని. ఇప్పటికే గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కష్టపడి చదివి . యస్ ఐ . కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య రాతపరీక్ష లు రాసి కటాఫ్ మార్కుల తుది ఎంపిక జాబితా కోసం ఎదురు చూస్తున్న సమయంలో గతంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతున్న సందర్భంలో. ఈ జీవో నెంబర్ 46 విషయం సాధారణ పరిపాలన శాఖ పరిధిలో ఉండటం వలన ప్రభుత్వమే గ్రామీణ ప్రాంత పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా జీవోను రద్దుచేసి రాష్ట్రమంతా పాత పద్ధతిలోనే కొనసాగించి కానిస్టేబుల్ నియామకాలు చేపట్టి వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.