వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డిసిపిగా పి.రవీందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రెండు క్రితం రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పి. రవీందర్ ను ఈస్ట్ జోన్ నూతన డిసిపిగా నియమించబడటం జరిగింది. 2010 డిఎస్సీ బ్యాచ్ కి చెందిన డిసిపి రవీందర్ డి.ఎస్సీ శిక్షణ అనంతరం మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల సబ్ డివిజినల్ పోలీస్ అధికారిగా తన పోలీస్ ప్రస్థానం ప్రారంభించి, కరీంనగర్, సిసిఎస్ హైదరాబాద్లో డి.ఎస్పీగా పనిచేసారు. 2017లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది కరీంనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో అదనపు ఎస్పీగా పనిచేసారు. 2021 సంవత్సరంలో డి.సి.పిగా పదోన్నతి పొందిన రవీందర్ ప్రస్తుతం సి.ఐ.డి విభాగంలో పనిచేస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డిసిపిగా బదిలీ అయినారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ పరిధిలోని అధికారులు ఇతర పోలీస్ సిబ్బంది. నూతన డిసిపిని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పా గుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు. అనంతరం నూతనంగా ఈస్ట్ జోన్ డిసిపిగా బాధ్యతలు చేపట్టిన పి. రవీందర్ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసారు