ప్రభుత్వ నిర్లక్ష్యం తోనే నగరం జలమయం.
Hanamkonda29 వ డివిజన్ రామన్నపేట లోని వరద బాధితులకు భోజన ప్యాకెట్లు నీళ్ళ బాటిల్ పంపిణీ చేసిన నాయిని…
ప్రభుత్వ నిర్లక్ష్యం తోనే కాలనీలు నీట మునిగాయి.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి.
జలమయమైన లోతట్టు ప్రాంతాలను సందర్శిస్తూ బాధితులకు భరోసా కల్పించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను మౌలిక వసతులు కల్పించాలి
నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేయడంలో స్థానిక ఎం.ఎల్. ఏ & బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.
అండర్ డ్రైనేజీ పనులు నత్తనడకన సాగడం, అసంపూర్తిగా ఉండటం నగర వాసులకు శాపంగా మారింది.
ఏళ్లు గడుస్తున్నా.. పనుల్లో జాప్యం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించు కోకపోవడం విడ్డూరంగా ఉంది.
ముంపు ప్రాంతాలు ఏటేటా పెరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది.
ప్రజలకు మాటలు తప్ప ఈ ప్రభుత్వం చేసింది శూన్యం.
వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాం అంటున్న ఎమ్మెల్యే ఒక్కసారి ఈ ముంపు ప్రాంతాలను సందర్శించి ఏం అభివృద్ధి చెందిందో చెప్పాలి.ఇదేనా మీ ప్రగతి ? అభివృద్ధి ?
నగరాభివృద్ధి కి ఏటా వంద కోట్లు ఇస్తాం అన్న సీఎం కెసిఆర్ హామీ ఏమైంది
బీఅర్ఎస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు.
ప్రజా సమస్యలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ, మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్, పిసిసి సభ్యులు వత్తిని శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు ఎస్.చెన్నమల్లు, స్థానికులు సౌరం బాలకృష్ణ, మేకల లక్ష్మణ్, పాకల మురళీ కృష్ణ, కే.ప్రేమ, గోర్కటి మహేందర్, సౌరమ్ కుమార్, జి మహేష్, వేల్పుల రాజు, ఆర్య వైశ్య సంఘ నాయకుడు జి. సత్యనారాయణ, రషీద్, మహేందర్, తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి, గొర్కటి రవి, బంక సంపత్, పల్లె రాహుల్ రెడ్డి, జి. సంగీత్ తదితరులు పాల్గొన్నారు.