
యువ నాయకత్వం వైపు మొగ్గుచూపుతున్న నియోజకవర్గ ప్రజలు
కోదాడ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు యువ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.శుక్రవారం 10వ రోజు మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమంలో భాగంగా మునగాల మండలం పరిధిలోని జగ్గుగూడెం, నరసింహుల గూడెం,రేపాల సీతానగర్ గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం లో ఇప్పటివరకు పాలించిన ప్రజాప్రతినిధుల వారసత్వ పాలన కుటుంబ పాలన పోయి యువ నాయకత్వ పాలన రావాలనే దిశగా ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు.మండల పరిధిలోని జగ్గు గూడెం గ్రామానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వారు అత్యవసర సమయంలో హాస్పిటల్ కి వెళ్లే లోగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో కూడా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గ్రామస్థాయి నుంచి గ్రేటర్ స్థాయి వరకు అభివృద్ధి ఒకే దశలో జరిగిందని రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకుంటే కానీ ఊహించిన స్థాయిలో గ్రామాలు అభివృద్ధి జరగలేదని అన్నారు. మండలంలో అర్హులైన వారికి పెన్షన్లు రాక డబల్ బెడ్రూం ఇల్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం జగ్గు గూడెంలో ముస్లిమ్స్ సాదరంగా ఆహ్వానం పలికి పీర్ల సావిట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అంజి యాదవ్.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్,కతిమాల వెంకన్న, మాలోవత్ బాలు,బండి గోపి,జగ్య, బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,చిన్న బుజ్జి,స్రవంతి,బాలి లక్ష్మి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.