హామీలు నెరవేర్చని ప్రభుత్వం తప్పని ఓటమి:
డాక్టర్ అంజి యాదవ్
Suryapet
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి వారి సంక్షేయమే ధ్యేయంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు. ఆదివారం 13వ రోజు మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమంలో భాగంగా మునగాల మండలంలోని మునగాల, కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెం, గణపవరం,నారాయణ గూడెం,కృష్ణానగర్ గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కనీస అవసరాలను తీర్చడంలో విఫలం చెందిన రాష్ట్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అన్నారు. గత కొన్ని ఏళ్లుగా గణపవరం వాగుపై బ్రిడ్జి నిర్మించడంలో ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తిగా విఫలం చెందారని వర్షాల సమయంలో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న పట్టించుకోవడంలేదని పలువురు వాపోయారు అని అన్నారు. మునగాల మండలంలో ఇప్పటికీ ఇల్లు లేక గుడిసెల్లో జీవనం సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు ఇవ్వడంలో మండలానికి చవితి తల్లి ప్రేమ చూపించిందని ఎద్దేవ చేశారు. గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు తక్షణమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ అని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఈ మోసపు మాటలను బీసీలు నమ్మొద్దని అన్నారు. హామీలు నెరవేర్చలేని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో నన్ను ఆదరించి గెలిపించాలని అన్నారు..ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్, కతిమాలా వెంకన్న, మాలవతు బాలు,బండి గోపి, జగ్య ., బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,చిన్న బుజ్జి,స్రవంతి,బాలి లక్ష్మి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.