మండల ఆర్ఎంపి,పిఎంపి సంక్షేమ సంఘం సమావేశం నూతన కమిటీ ఎన్నిక
Suryapetమండల పరిధిలో రూరల్ మెడికల్ ప్రాక్టీస్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని సంఘం నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన శ్రీరాములు అన్నారు. ఆదివారం రోజు మండల కేంద్రంలో జరిగిన ఆర్.ఎం.పి, పి.ఎం.పిసంక్షేమ సంఘం నడిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో జరిగినది. సర్వసభ్య సమావేశం లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన రోగులను పరీక్షించి వారికి చికిత్స చేసి ప్రాణాలు రక్షిస్తున్న ఆర్ఎంపీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.ప్రజలు సీజనల్ వ్యాధులు సోకకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఆర్.ఎం.పి వైద్యులు ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలనికోరారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మంచి నీరు కలుషితమవుతున్నందున ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని వారు సూచించారు.కాచి చల్లార్చిన మంచినీటిని ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు.అనంతరం నూతన ఆర్ఎంపి, పి.ఎం.పి సంక్షేమ సంఘం మండల నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా శ్రీరాములు,గౌరవఅధ్యక్షులు కె. నాగభూషణం,ప్రధాన కార్యదర్శి యస్.కే సైదులు,కోశాధికారి సైదులు,వర్కింగ్ ప్రెసిడెంట్ బి.నాగేశ్వరావు,ఆర్గనైసింగ్ సెక్ట్రటరీ కె.గురుస్వామి,ఉపాధ్యక్షులు కనకరత్నం,వెంకట్,సహా కార్యదర్సులుగా నరేష్,సందీప్,అర్జున్ కార్యనిర్వాహక కార్యదర్శి గా యల్లయ్య లను ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీ పదవీకాలం సంవత్సరపాటు కొనసాగుతుందని డివిజన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు.