
MLA Dr. Rajaiah met CM KCR politely
ఈ రోజు…హైదరాబాదులోని అసెంబ్లీ హాల్ నందు గల సీఎం కేసీఆర్ గారి(తెలంగాణ శాసనసభ పక్ష నాయకుడి ఛాంబర్) ఛాంబర్ నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిసి ఈ క్రింద తెలుపబడిన పనుల మంజూరు విషయమై సీఎం కేసీఆర్ ని కోరగా సీఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే డా.రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఎమ్మెల్యే డా.రాజయ్య గారు సీఎం కేసీఆర్ గారిని కోరిన పనుల వివరాలు:
1.స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడేషన్ మంజూరు.
2.స్టేషన్గన్పూర్ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా చేయుట.
3.ఇటీవల కురిసిన భారీవర్షాలకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో డ్యామేజ్ అయిన రోడ్స్ మరియు కల్వర్ట్స్ మరమ్మత్తులు , పురారుద్దరణ కోసం నిధులు మంజూరు.