
విలేకర్లందరికీ డబల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలి
ప్రభుత్వానికి,ప్రజలకు వారధిగా ఉంటున్న విలేకర్లను ప్రభుత్వం ఆదుకోవాలి.
విషయాన్ని టి ఏ జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ రావు దృష్టికి తీసుకెళతాము.
మానుకోట జిల్లా అధ్యక్షులు పస్తం సైదులు.
తెలంగాణ ఆల్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు ఆదేశానుసారం మరిపెడ మండలం కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకర్లు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి మహబూబాద్ జిల్లా అధ్యక్షులు పస్తం సైదులు ముఖ్య అతిధిగా విచ్చేసి మరిపెడ మున్సిపాలిటీ ప్రభుత్వ అతిధి గృహంలో మరిపెడ మండల టి ఏ జె ఎఫ్ విలేఖరుల సన్నాక సమావేశం మండల అధ్యక్షులు ముడవత్ రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో .జిల్లా అధ్యక్షులు పస్తం సైదులు మాట్లాడుతూ విలేకరులందరికీ ప్రభుత్వం నుండి డబల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు.అతి త్వరలో టి ఎ జె ఎఫ్ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, ఆ సమావేశంలో విలేకరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.యూనియన్ కార్యచరణ కూడా ప్రకటిస్తామన్నారు.జిల్లా స్థాయిలో కూడా ఉత్సాహవంతులైన వారిని నూతన కమిటీలోకి తీసుకోవడం జరుగుతుందని,అలాగే మన కమిటీ సభ్యులందరూ క్రమశిక్షణతో మెలగాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కారంపురి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి శ్రీశైలం,మండల ప్రధాన కార్యదర్శి సురేష్,మండల కోశాధికారి రమేష్,చింత వెంకన్న,షాన్వాజ్,ప్రవీణ్, పస్తం సాంబ ఇంకా తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మరిపెడ మండలం నూతన కమిటీ ఎన్నిక.
టీఏజేఎఫ్ మరిపెడ మండల ఉపాధ్యక్షులుగా బోడపట్ల సతీష్,సహాయ కార్యదర్శిగా రాంపల్లి కపిల్,సమావేశ నిర్వాహకులుగా దేవరశెట్టి లక్ష్మీనారాయణ,ప్రచార కార్యదర్శిగా మహేందర్ ను టీఏజేఎఫ్ జిల్లా అధ్యక్షుల అధ్వర్యంలో నూతన కమిటీని, మరిపెడ టి ఏ జె ఎఫ్ విలేకరుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.