
విద్యార్థుల కి స్కూలు బ్యాగ్స్ కిట్స్ పంపిణీ
విద్య అనేది శక్తివంతమైనదని,విద్య తోనే ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండుతాయని విద్యార్థులకు ఎన్నారై రామ్ రెడ్డి సూచించారు.శుక్రవారం ఖ్యాతంపల్లి గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రామన్న యువసేన ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్,విద్యా సామగ్రి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,టీచర్స్,మరియు గ్రామ సర్పంచ్ అవనిజ రెడ్డి,మాజీ సర్పంచ్ చాడ నరసింహారెడ్డి,గ్రామ నాయకులు విప్లవ రెడ్డి,నారాయణగిరి మాజీ ఉపసర్పంచ్ పుట్ట కుమార్, వల్లపు రెడ్డి రాజిమ్మ రెడ్డి, గంటే కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.