
ఘనంగా డాక్టర్ తాటికొండ క్రాంతి రాజ్ జన్మదిన వేడుకలు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పెద్ద కుమారుడు,ఆర్ ఎం హెచ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రాంతిరాజ్ జన్మదిన వేడుకలను హనుమకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు హాస్పిటల్ స్టాఫ్ మరియు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తల్లం శ్రీనివాస్,బుస్స శ్రీనివాస్, రాజు,దస్తగిరి,పల్లవి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ తాటికాయల చిరంజీవి,చిల్పూర్ మండల యూత్ ఉపాధ్యక్షుడు అరూరి రవిచందర్,నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్ గుర్రపు ప్రవీణ్,ధర్మసాగర్ మండల యూత్ కార్యదర్శి గంగారపు రాజు,తదితరులు పాల్గొన్నారు.