
స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ అవుతుంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో భాగంగా జీరో హవర్ లో ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటి రామారావు ని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో మాట్లారు.అసెంబ్లీ జీరో హవర్ లో మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని స్టేషన్ ఘన్పూర్ మేజర్ గ్రామపంచాయతీ,శివునిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మరియు చాగల్ గ్రామపంచాయతీలను కలుపుకొని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంగా మున్సిపాలిటీ చేయాలని గతంలో కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగిందని అంతేకాకుండా సంబంధిత శాఖమంత్రివర్యులు కేటీఆర్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి వచ్చినసప్పుడు కూడా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని తప్పకుండా మున్సిపాలిటీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు.స్టేషన్గన్పూర్ , శివునిపల్లి మరియు చాగల్ గ్రామాలను కలుపుకొని దాదాపు 23000 జనాభా ఉన్నది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరగా స్టేషన్గన్పూర్ మేజర్ గ్రామపంచాయతీ , శివునిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మరియు చాగల్ గ్రామపంచాయతీలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ చేయుటకు వారి సమ్మతిని తెలుపుతూ ఆయా గ్రామపంచాయతీల తీర్మానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగినది కావున వెంటనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయాలని రాజయ్య స్పీకర్ ద్వారా సంబంధిత శాఖమంత్రిని కోరారు.అందుకు స్పందించిన మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో అది నోట్ చేసుకోవడం జరిగిందని పరిశీలనలో ఉన్నదని సాధ్యమైనంత త్వరగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.