
కంప్యూటర్ ఆపరేటర్ సమస్యలపై నవీన్ మిట్టల్ కలిసిన సండ్ర
ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గని కలిసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
రెవిన్యూ శాఖ నందు గత 20 సంవత్సరాలుగా టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లుగా మండల తహసిల్దార్ కార్యాలయాల నందు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల నందు రెవిన్యూ డివిజన్లో 334 మంది పనిచేస్తున్నారని, వారికి రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ జీతంతో సమవేతనం వచ్చే విధంగా పే స్కేల్ వర్తింపచేసే విధంగా చూడాలని, వారి సమస్యలను తీర్చాలని కోరుతూ హైదరాబాదు నందు ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ని సత్తుపల్లి శాసనసభ్యులు కలిసి వినతి పత్రాన్ని అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.