
శ్రీరంగపురం లో షార్ట్ ఫిల్మ్ చిత్రికరణ
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే స్వచ్ సర్వేక్షణ గ్రామీణ 2023 అవార్డు కు మండలం లోని శ్రీరంగపురం గ్రామ పంచాయతీ ఎన్నికైనట్లు గ్రామ సర్పంచ్ నాగేశ్వరావు, సెక్రటరీ ప్రత్యూష లు సోమవారం విలేకరుల సమావేశం లో తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ లోని కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల నుండి ప్రతి ఇంటా టాయిలేట్స్,గ్రామంలో వైకుంఠ దామం, పల్లెపకృతి వనం,నర్సరీ, సేగ్రీగేషన్ షెడ్ లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మించడం తో వాటిని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకరావడం తో కేంద్ర ప్రభుత్వం అధికారులు గ్రామలలో పర్యటించి శ్రీరంగపురం గ్రామపంచాయతీని స్వచ్ సర్వేక్షణ గ్రామీణ అవార్డు కు ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. ఈ అవార్డు లో భాగంగా గ్రామంలో జరిగిన అభివృద్ధి పై ఒక షార్ట్ ఫిలిమ్ చిత్రికరిస్తున్నట్లు తెలిపారు. షార్ట్ ఫిలిమ్ చిత్రికరణతో గ్రామం లో సినిమా షూటింగ్ వాతావరణం కన్పిస్తుందని గ్రామస్తులు తెలిపారు.