
కాసాని కాశయ్య గౌడ్ మృతి బాధాకరం
కాసాని కాశయ్య గౌడ్ మృతి బాధాకరమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన కాసాని శ్రీనివాసరావు సోదరుడు కాసాని కాశయ్య గుండెపోటుతో మరణించగా ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య, ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్, పోలంపల్లి వీరబాబు, రాజుల కృష్ణమూర్తి, కురాకుల కృష్ణమూర్తి, రఘు, చింతల వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.