
ప్రజా యుద్ధనౌక గద్దర్ కు ఘన నివాళి
బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతవు కొడకో నైజాము సర్కరోడా అంటూ… నైజాం కు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన,నినదించిన, పాటతో తుటా పేల్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్, నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గద్దర్ కు నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్దర్ తన గళంతో దోపిడీ వర్గాల పై తన పాటల తో యుద్ధం చేసిన యోధుడు అని తాడిత , పీడిత ప్రజల పక్షాన నిలిచి వారి ప్రయోజనాల కోసం కడవరకు పోరాడిన ఘన చరిత్ర అని ఆయనకి విప్లవ జోహారులు అంటూ నినదించారు. నేటి తరం, జర్నలిస్టులు సైతం ఆయన ఆశయ సాధనకై కృషి చేయాలని, పేదల పక్షాన పోరాటాలు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో, పూర్ణచంద్రరావు మరికంటి లక్ష్మణ్, గంధం వెంకటనారాయణ, కుడుముల సైదులు, చింతలపాటి సురేష్, గోపాలకృష్ణ చెరుకుపల్లి శ్రీకాంత్,తంగేళ్లపల్లి లక్ష్మణ్, నజీర్ లు,చీమ శేఖర్, హమూద్, మతంగి సైదులు సిరికొండ శ్రీను, శ్రీహరి, దినేష్, కందిబండ హరీష్ శీను ఉపేందర్ రామకృష్ణ జి లక్ష్మీనారాయణ , కొలిచలం నరేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు