రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలి
Hyderabadహైదరాబాద్ పెండిగ్ లో ఉన్న పి.ఆర్, ఆర్&బి,ఐటిడిఏ రోడ్లు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
రవాణా, రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మరియు గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ములుగు ఇంఛార్జి మంత్రి సత్యవతి రాథోడ్ గారిని కలిసి పలు సమస్యలు వివరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు హైదరాబాద్ లో
రవాణా, రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మరియు గిరిజన,శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారిని కలిసి ములుగు నియోజక వర్గం లోని పలు సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ఇటీవలే కురిసిన భారీ వర్షాల మూలాన ములుగు నియోజక వర్గం లో అపార అస్తి నష్టం,ప్రాణ నష్టం వాటిల్లింది రోడ్లు వాగులు వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై అనేక గ్రామాలు నీట మునిగి ప్రజలు సర్వసం కోల్పోయి రోడ్డున పడ్డారు ముంపుకు గురైన ప్రజలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారు ముంపుకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అదే విధంగా లోతట్టు గ్రామాల ప్రజలకు ఇంటి స్థలం తో పాటు డబుల్ బెడ్ కట్టించి ఇవ్వాలి వరుద ల్లో కొట్టుకు పోయి మరణించిన మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రే షియా ఇవ్వాలి అనేక రోడ్లు బ్రిడ్జి లు వరుద ల వలన కొట్టుకు పోవడం జరిగింది రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
గతం లో మంజూరైన ఆర్&బి
పి. ఆర్, ఐటిడిఏ రోడ్లు కాంట్రాక్టర్ల నిర్లక్షం మూలాన పనులు ప్రారంభించ లేక పోవడం తో వర్ష కాలం కావడం సరైన రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు నిర్లక్షం గా వ్యవహరించిన కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి త్వరితగతిన పనులు ప్రారంభించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సీతక్క