
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగు నర్సయ్య మృతి
జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలో రంగు నర్సయ్య (8౦) అనారోగ్యంతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య నర్సయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తో సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్& నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు ఎంపీపీ రడపాక సుదర్శన్,అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిదులు,ముఖ్య నాయకులు గ్రామస్తులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.