
వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నాయని
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు డివిజన్ అద్యక్షులు, అనుబంధ సంఘాల అద్యక్షులు మరియు హన్మకొండ జిల్లా ముఖ్య నాయకులతో జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ నెల 14 న నిర్వహించబోయే కార్పోరేషన్ ముట్టడిపై నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ …
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలపై ఎన్ని పోరాటాలు చేసిన, ఉద్యమాలు చేసిన కూడా వారికి దున్నపోతు మీద నీళ్ళు పోసిన చందంగా మారింది. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అనేక రకాల హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కింది. ప్రజా ప్రయోజనాలు అభివృద్ధిని మరియు పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. అందుకే ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయింది. అందులో భాగంగా ఈ నెల 14 న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ముట్టడికి పిలుపు నివ్వడం జరిగింది.
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, వరదలతో ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు సహయం చేయాలని, వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి తక్షణమే ఆర్ధిక సహయం అందించాలని, వరద భీభత్సంతో తుడుచుకుపోయిన కుంటలు నాళాలను, రోడ్లను యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించాలి. వరద బాదితులకు కొన్ని నియోజకవర్గాల్లో 10 వేల ఆర్ధిక సహాయం ఇస్తూ కొన్ని నియోజకవర్గాలను విస్మరించారని, కాబట్టి వెంటనే మిగతా నియోజకవర్గాలకు కూడా 10 వేల ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు.
- హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మరియు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండాను హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
- హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా గాయకుడు గద్దర్ & సియాసత్ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి నివాళులు అర్పించారు.
ఈ సమావేశంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, కార్పోరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, INTUC జిల్లా అద్యక్షుడు కూర వెంకట్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అంకుష్, ఖాజమోహినుద్దిన్, ఎం.వి. సమత, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, NSUI జిల్లా అద్యక్షుడు పల్లకొండ సతీష్, డివిజన్ అద్యక్షులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.