ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ కార్మికులకు కనీస వేతనం 24000 ఇవ్వాలి ఈఎస్ఐపిఎఫ్ సక్రమంగా అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది పర్మినెంట్ పని ఉండే ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ లో పనిచేయు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వం గుర్తించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు అటువంటి కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని కనీస వేతనాలు అమలు చేయడం లేదని వెంటనే వారి కనీస వేతనాలు 24,000 ఇచ్చి వారందరినీ పర్మినెంట్ చేసేందుకు కృషి చేయాలని లేనియెడల రైల్వే స్టేషన్ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అమృత, సత్యనారాయణ, అనిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.