తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న జనాభా శాతం యాదవులే అని యాదవులు రాజకీయంగా చైతన్య కావాల్సిన అవసరం ఉందని శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి అయినబోయిన ఉపేందర్ యాదవ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న యాదవులను ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తూనే వస్తున్నాయని ఇకనైనా రాజకీయాల్లో యాదవులకు అత్యధికంగా సీట్లు కేటాయించి యాదవులకు సముచిత న్యాయం చేయాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది అని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు పుట్ట వీరేశం, మాజీ జెడ్పిటిసి సభ్యులు చీర్ల రాజేశ్వర్ యాదవ్, మండల యాదవ సంఘం అధ్యక్షులు కుకుట్ల ఈశ్వర్ యాదవ్ లకు యాదవ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.