నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
బొమ్మలరామారం మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉప్పల జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ఈటబోయిన బాలకృష్ణ ,ఉపాధ్యక్షులు గా పొలగౌని కరుణాకర్ గౌడ్ ,కోశాధికారి ఎల్లబోయిన శ్రీహరి ,ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా గుదే బీరుమల్లేశ్, బేతాళ శ్రీనివాసులు, ఎడిజేర్ల భూపాల్, జూపల్లి బాలకృష్ణ ,దాసరి కృష్ణారెడ్డి, వడ్లకొండ అనిల్, లను ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉప్పల జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షులు ఈ టబోయిన బాలకృష్ణ మాట్లాడుతూ.. మండలంలోని వార్తల సేకరణ తో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.