
విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివాలి
ప్రతి విద్యార్థి ప్రణాళిక బద్ధంగా చదివి తమ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని బుర్రా వెంకట్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నంత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో
9,10 వ తరగతుల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
బివిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ముందు తరాలను ఆదర్శంగా తీసుకొని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బివిఆర్ ఫౌండేషన్ సభ్యులు బుర్రా ప్రమోద్ రెడ్డి, బుర్రా గోవిందరెడ్డి, నడిగూడెం పిఎసిఎస్ చైర్మన్ పుట్ట రమేష్, నాయకులు బాణాల నాగరాజు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు, కనకమ్మ, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.