
జాతీయ జెండా విక్రయాలను సద్వినియోగం చేసుకోవాలి
జాతీయ జెండా విక్రయాలను సద్వినియోగం చేసుకోవాలని మునగాల సబ్ పోస్ట్ మాస్టర్ జ్ణానేశ్వరి అన్నారు. మండల కేంద్రంలోని న్యూ ప్రజ్ణ హైస్కూల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవు లో భాగంగా హర్ ఘర్ తీరంగా 2.0 ఉత్సవాల సందర్భంగా జాతీయ జెండాను పాఠశాల కరస్పాండెంట్ కాంచాని కృష్ణమూర్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు .మునగాల సబ్ పోస్ట్ ఆఫీసులో విక్రయిస్తున్నట్లు తెలిపారు. పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బీపీఎంలు మోతీలాల్, రామనర్సయ్య, ఏబీపీఎంలు నాగార్జునపు బ్రహ్మచారి, దివ్య, సిబ్బంది పాల్గొన్నారు.