
దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి…
రాజకీయ ప్రయోజనం కోసమే దేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ లు ఐక్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నాయని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమ్మద్ అబ్బాస్ ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
“ఉమ్మడి పౌరస్మృతి – మణిపూర్ పరిణామాలు- బిజెపి ప్రభుత్వ విధానాలు” అనే అంశంపై నిర్వహించిన సెమినార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఐక్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ ప్రశ్నించే గొంతులను హత్య లు చేస్తున్నారనిఅన్నారు. ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లిం మైనార్టీలపై, క్రిస్టియన్ మైనార్టీలపై దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఘర్షణలు, మత విద్వేషాలు సృష్టిస్తూ దాడులకు పాల్పడుతున్నారనివిమర్శించారు.ఒకే దేశం, ఒకే చట్టం,ఒకే న్యాయం,ఒకే పాలసీ, ఒకే మతం అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దోపిడి, వివక్ష, ఉన్మాదంతో కుట్రలు చేస్తుందన్నారు. సోదర భావంతో మెరుగుతున్న ప్రజల మధ్య ఉమ్మడి పౌరస్మృతి పేరుతో చీలికలు తెచ్చే కుతంత్రాలకు ఉనుకుంటుందని విమర్శించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో నేటికీ ఆర్థిక అసమానతలు అంతరించలేదన్నారు. నేటికీ సామాజిక వివక్ష తొలగ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, బిజెపి దేశంలో ఏకరూపం సాధించాలని 21వ లా కమిషన్ నియమిస్తే దేశం యొక్క ఐక్యత సమగ్రతలు కాపాడాలంటే ఇప్పుడు పౌరస్మృతి అవసరం లేదని లా కమిషన్ సిఫారసు చేసిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తితో ఉన్న ఈ దేశంలో ఎన్నో మతాలు, జాతులు, సాంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, ఆచార వ్యవహారాలు ఉన్న ఈ దేశంలో కుల,మత ఘర్షణలకు తావు లేదన్నారు. లౌకిక శ్రేయో రాజ్యంలో ఎన్నికల సమయంలో ఈ పౌరస్మృతి చట్టాన్ని ముందుకు తెచ్చి ప్రజల మధ్య మత విద్వేషాలను పెంచి బడుగు, బలహీన వర్గాల, దళిత, గిరిజనులను దోపిడీ చేసి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే దురుద్దేశం తో బిజెపి చేస్తుందన్నారు. ఇటీవల మణిపూర్ లో జరిగిన గిరిజన మహిళల వివస్త్రణ,గిరిజనుల ఊచకోత, హర్యానాలో మైనార్టీలపై దాడులు మనుధర్మంలో భాగమేనని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకుందన్నారు. ఆర్ఎస్ఎస్, బిజెపి అనుసరిస్తున్న ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ వ్యతిరేక విధానాలను మతోన్మాద చర్యలను ప్రజలంతా తిప్పి కొట్టాలని కోరారు. మణిపూర్ రాష్ట్రంలో వందలకొద్దీ హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నందున ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఆ రాష్ట్ర బిజెపి పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. మణిపూర్ రాష్ట్రంలో వందల కొద్ది ఘటనలు జరిగాయని ఆ ఘటనలో అనేకమంది అత్యాచారాలకు గురయ్యారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. ఆదివాసీ మహిళ అయినటువంటి రాష్ట్రపతి, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.గత మూడు నెలల నుండి మణిపూర్ లో మారణ హోమం జరుగుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీఆ రాష్ట్రంలో పర్యటించి శాంతిని నెలకొల్పలేక పోయారని విమర్శించారు. ప్రధాని ప్రారంభంలోనే స్పందించి ఉంటే ఇంతటి దారుణాలు వందల కొద్ది మరణాలు, మహిళలపై సామూహిక హత్యాచారాలు జరిగేవి కావని కావన్నారు. కుకీ గిరిజన తెగకు సంబంధించిన ఒకరిని తల నరికి తడకకు వేలాడదీశారంటే ఆ రాష్ట్రంలో ఎంతటి భయాందోళన వాతావరణం ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా గిరిజన తెగలు, ఇతర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్న మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరగడానికి బిజెపి అనుసరించిన మతోన్మాద రాజకీయాలే కారణమని ఆరోపించారు. దేశ రక్షణ కోసం పని చేసిన ఒక సైనికుడి భార్యని తన కళ్ళముందే బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేయడం భారతమాత సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి అనుసరిస్తున్న విద్వేష, మతోన్మాద విధ్వంసకర విధానాలకు మణిపూర్ మారణ హోమం ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. సైన్యం, పోలీసుల కళ్ళెదుటే ఇంతటి దారుణాలు జరుగుతుంటే అరికట్టలేని ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి అర్హత లేదని బర్త్ రఫ్ చేసి శాంతిని నెలకొల్పెందుకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలకు పాల్పడిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.వేల సంవత్సరాల నుండి వివిధమతాలు తమ సాంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకుంటారని అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతగదన్నారు. ప్రజలఆచారాలను సాంప్రదాయాలను ప్రభుత్వాలు గౌరవించాలి తప్ప అందులో జోక్యం చేసుకొని వారి మనోభావాలను దెబ్బతీయడం తగదన్నారు. మతోన్మాద విధానాలకు పాల్పడుతున్న బిజెపిని గద్దె దించేంతవరకు ప్రజలంతా ఐక్యంగాపోరాడాలని పిలుపునిచ్చారు.సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగినఈ సెమినార్ లో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు డేవిడ్ రాజు, ముస్లిం మైనార్టీ నాయకులు ముక్తి అస్సాన్ సాబ్,హఫీస్ ఇమ్రాన్, పాస్టర్ల సంఘం నియోజకవర్గ నాయకులు బోనగిరి లింగయ్య, మీసాల గోవర్ధన్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, వివిధ సంఘాల నాయకులుచాంద్, శేఖర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.