
ఉచిత వైద్య శిబిరం.. మందుల పంపిణీ
ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని ఆరోగ్య హాస్పిటల్ సీనియర్ వైద్యులు డా శశిసుందర్ అన్నారు. పెనుయేలు వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో శనివారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని రోగులకు ఉచితంగా వైద్యం చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు శశిసుందర్, రవిలు మాట్లాడుతూ, ప్రజల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ వైద్య శిబిరంలో గుండె, కంటి ఆపరేషన్లు మరియు మోకాలు, భుజము, మెడకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి నుండి దాదాపు 215 మంది ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వారు తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చిన అందరికీ ఉచితంగా పరీక్షలు, మందులు కూడా అందివ్వడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా నిర్వాహకులు పెనుయేలు వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్ఎంపి వైద్యులు ఏ. బిక్షపతి, పి. పృద్వి, సైదిరెడ్డి, పెనుయేలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జె. సామ్యూల్, జి. ప్రభాకర్, ఎం. రాజేష్, జె. ప్రవీణ్, ఇ. ఉదయ్, ఎల్. లాజర్, జి. ఒబద్యా, కె. రాజు, తబిత, వనజ, రాణి, సుగుణమ్మ, దానియేలు తదితరులు పాల్గొన్నారు