
సభ్యుల సంక్షేమమే లక్ష్యం
ఆదాయ, వ్యయాలను పారదర్శకంగా నిర్వహిస్తూ, ప్రెస్ క్లబ్ అభ్యున్నతికి పాటుపడతామని ,ప్రతీ సభ్యుడి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో జాతీయ జెండాను అధ్యక్షుడు వేముల నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ గత కమిటీ ఆదా య-వ్యయాల లెక్కలను నిర్ణీత సమయంలో నూతన కమిటీకి అందించలేదన్నారు. దీంతో సభ్యుల సంక్షేమా నికీ కృషి చేయాల్సిన విలువైన సమయం నూతన కమిటీకి వృథా అవుతోందన్నారు. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా పాత కమిటీ లెక్కల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, పారదర్శకంగా ఉంటామని, ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని వేముల నాగరాజు స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమానికి కార్యక్రమాలు కొనసాగించడానికి తమ కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సభ్యుల సంక్షేమంపై దృష్టిపెడతామని త్వరలో ఇన్సూరెన్సులు, గుర్తింపుకార్డులు అందిస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి వర్కింగ్ వర్కింగ్ జర్నలిస్టులకు అందించాల్సిన సొంత ఇంటి స్థలాల సాధన కోసం యూనియన్లను కలుపుకుని, క్లబ్ కార్యవర్గం ముందుకెళుతుందని వేముల నాగరాజు చెప్పారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలను అందించే విషయాన్ని స్వాతంత్ర్య దినోత్సవ అధికార ప్రసంగంలో చేర్చాలని కోరగానే చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తన ప్రసంగంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయాన్ని పొందుపర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ త్వరలో ఇంటి స్థలాలు అందించి, జర్నలిస్టుల చిరకాల కోరిక నెరవేర్చాలని మరోసారి క్లబ్ కార్యవర్గం తరఫున చీఫ్ విప్ కు విజ్ఞప్తి చేశారు.ఈ వేడుకల్లో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్, క్లబ్ పూర్వ అధ్యక్షులు పీవీ మదన్ మోహన్, పిన్నా శివకుమార్, గడ్డం కేశవమూర్తి, టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) నేతలు దాసరి కృష్ణారెడ్డి, గాడిపల్లి మధు, గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను,దుర్గా ప్రసాద్, అల్లం రాజేష్ వర్మ, యాంసాని శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు సంపెట సుధాకర్ వరప్రసా ద్,వలిశెట్టి సుధాకర్,బూర్ల నరేందర్, పొడిచెట్టి విష్ణువర్ధన్,ఈసీ మెంబర్లు దొమ్మటి శ్రీకాంత్, ఆంజనేయులు,నయీం పాషా, దిలీప్, సంజీవ య్య మంచాల రాజు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి పలువురు సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు