
మోషన్ కాలేజీ నందు రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
హన్మకొండ నయంనగర్ లోని మోషన్ కాలేజీ నందు మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మోషన్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగాలు, ఎన్నెన్నో పోరాటాలు, ఈరోజు మనం అనుభవిస్తున్న త్యాగాల ఫలాలని, భారతీయతని నిన్నటి తరం బాధ్యతగా ఇచ్చిందని, భారతీయతని నేటితరం బలంగా మార్చుకుందని, భారతీయతని మనమంతా తరతరలకు సందేశంగా పంపాలని ఆయన కోరారు. అదే విధంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలమే మనకు లభించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం, దేశ ప్రజల ఆత్మగౌరవమై ఎగిరే మువ్వన్నెల జెండాకి నా సెల్యూట్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మహానుభావుల త్యాగాలను కొనియాడారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కూడా వాళ్ళు ఎంచుకొన్న లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు, కళాశాల అధ్యాపకులకు, కళాశాల సిబ్బందికి 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజీ డైరెక్టర్ చిర్ర గణేష్ గౌడ్, అకాడమిక్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, కళాశాల అధ్యాపకులు మోహన్ కుమార్ మంగళమ్, అనుజ్ కపూరు, సాహెల్ కట్యాల్, డా. శుభమ్ షా, రవీందర్, శ్రీనివాస్ రెడ్డి మరియు కళాశాల సబ్బింది మురళి, తాళ్లపెల్లి రమేష్ గౌడ్, శనిగరపు సుమన్, బండి రాజు, విజయ్, భాగ్యలక్ష్మి, ప్రియాంక, ధరణి, అరుణ తదితరులు పాల్గొన్నారు