
స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో బిజెపి ప్రభుత్వాన్ని గద్దేదిoచూద్దాం
స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి మతోన్మాద ప్రభుత్వాన్ని
గద్దెదిoచుదామని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ పిలుపునిచ్చారు
సోమవారం రోజున జనగామ జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయం వద్ద 76వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత కిసాన్ సభ పిలుపులో భాగంగా భారత జాతీయ పతాకాన్ని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ఆవిష్కరించారు*
అనంతరం రామావత్ మీట్యా నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ…….
దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తున్న బ్రిటీష్ వారు పోవాలని సంపూర్ణ స్వాతంత్రం కావాలని మా వనరులు మానకే కావాలని ఆనాడు సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ర రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కులగొట్టి ఆగస్టు 15 1947 నాడు అనేక మంది పోరాట యోధులు తమ రక్త తర్పణంతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని స్వతంత్ర ఉద్యమంలో విద్రోహ పాత్ర నిర్వహించిన బిజెపి నేడు భారతదేశన్ని పరిపాలిస్తుందని బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి బడా కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పనంగా దోచిపెడుతుందని ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కారు చౌకగా బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని బ్రిటిష్ నాటి కాలం నుండి కార్మికులు పోరాడి సాధించుకుంటున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మికుల శ్రమను దోచుకుంటుందని దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే విమానాయానం బిఎస్ఎన్ఎల్ బొగ్గు గనులు ఎల్ఐసి వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోడీషా అమ్ముతుంటే అంబానీ అదాని కొంటున్నారని దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని అమ్మిన తర్వాత పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజల వద్ద ఉన్న భూముల్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిందని ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ నడిబొడ్డున లక్షలాదిమంది రైతులు 13 నెలల పాటు పోరాటం చేసిన ఫలితంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్లమెంట్ సాక్షిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నారని ఈ సందర్భంలో మోడీ అధికారంలో వచ్చినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి న హామీని అమలు చేయాలని డిమాండ్ చేయడంతో రాతపూర్వకంగా రైతులు పండించే అన్ని రకాల పంటలకు స్వామి నాదన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని దేశంలోని రైతులందరి రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి రుణ విమోచన చట్టం పార్లమెంట్లో చేయాలని కార్పొరేట్ శక్తులకు కాకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా పంటల బీమా పథకాన్ని సవరించాలని రైతు వ్యతిరేక నల్ల చట్టాల పోరాటంలో అసువులు బాసిన 750 మంది రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రైతు నాయకుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చడాన్ని విరమించుకోవాలని విద్యుత్ సరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ జoడా ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట మల్లయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మబ్బు వెంకటేష్ కోయల్ కార్ సాయి ప్రకాష్ రైతులు తదితరులు పాల్గొన్నారు