
రేపాలలో ఘనంగా77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, అంగన్వాడి కేంద్రం 01, ప్రాథమిక పాఠశాలలో, 77వ స్వాతంత్రం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాల చరిత్ర సుదీర్ఘమైనది, ప్రపంచ చరిత్రలో అనేక రకాల ఉద్యమాలతో స్వాతంత్రాన్ని సాధించిన చరిత్ర భారతదేశానికి కలిగి ఉందని. దేశ స్వాతంత్య్ర పోరాటంలో, అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు తమ బాధ్యత నెరిగి కర్తవ్యాన్ని చేపట్టాలి, వర్గ విభేదాలు పాక్షిక ప్రయోజనాల సంకుచిత దృష్టి వదిలి, సమగ్ర దేశాభ్యుదయ దిశగా పయనించడమే స్వాతంత్ర్య దిన దీక్ష కావాలని అన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి బెజవాడ సీతారాములు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లి రమణ వీరారెడ్డి, ఉప సర్పంచ్ గండు జ్యోతి ఉపేందర్, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మారెడ్డి,మేకపోతుల సీతారాములు (అడ్వకేట్), డాక్టర్ వినయ్ కుమార్, అంగన్వాడి టీచర్లు బెజవాడ శ్రీలత,గంట రాజేశ్వరి గ్రంథాలయ చైర్మన్ ఆలగడప రమేష్, విద్యా కమిటీ చైర్మన్ కుంటి గొర్ల వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు పల్లి ఆదిరెడ్డి, కుంటిగొర్ల కృష్ణమూర్తి, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మొగిలిచర్ల సత్యనారాయణ, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చైర్మన్ పొనుగోటి రంగా,గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.