
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలు
తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలను, మొగలాయిల దౌర్జన్యలను ఎదురించిన ధీశాలి, గోల్కొండ కోటను పరిపాలించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆర్ అండ్ బి అతిథి గృహం మరిపెడ గోపా అధ్వర్యంలో తొర్రూర్ గోపా డివిజన్ సెక్రెటరీ గంధసిరి కృష్ణ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు జిల్లా గోపా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ , తొర్రూరు డివిజన్ అధ్యక్షులు తాల్లపల్లి రమేష్ గౌడ్, మరిపెడ గౌడ సోదరులు పాల్గొని కార్యక్రమములో నివాళులు అర్పించారు.బహుజన రాజ్యం కోరకు గోల్కోండ కోటను అధిరోహించి గోల్కోండ సింహసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేసారు, ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకోని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. గోపా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, గోపా తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు తాళ్ళ పల్లి రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ, 18 వ తారీఖు నా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా చాపనకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు, 18 వ తారీఖున గౌడ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయంతి ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు, సర్వాయి పాపన్న గౌడ్ జీవితం, పోరాట పటిమ ఎప్పటికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.సర్దార్ పాపన్న గౌడ్ ఒక జాతికో, ఒక కులానికో పరిమితం కాదని ,సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అని అలాంటివారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, ముఖ్యంగా యువత సర్వాయి పాపన్న ఆశయాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు., ఒక మంచి సంకల్పంతో పనిచేస్తే ఏ స్థాయికి అయినా వెళ్ళవచ్చు అని సర్దార్ సర్వాయి పాపన్న నిరూపించారని, వారి మార్గాన్ని ,వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనీ అన్నారు, ఈ కార్యక్రమంలో తొర్రూర్ గోప జనరల్ సెక్రెటరీ గంధసిరి కృష్ణ గౌడ్ మెంచు అశోక్ గౌడ్, రాంపల్లి అబ్బయ్య గౌడ్, గందసిరి అంబరీష, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, సుందర్, స్టాలిన్, బిక్షపతి ఉపాధ్యాయ జనరల్ సెక్రెటరీ గోపా సంఘం లింగాల మహేష్ గౌడ్, ఆయా గ్రామాల గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు