
తల్లాడలో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పలుచోట్ల 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమాలలో తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు పాల్గొన్నారు మండల పరిషత్ కార్యాలయంలో జండా ఆవిష్కరణ చేశారు…
- మండల పరిషత్ కార్యాలయంలో…. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అధ్యక్షతన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎంపీపీ జండా ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మనమీ స్వేచ్ఛను అనుభవించడానికి ఎందరో మహానుభావులు బలిదానాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు..
- తల్లాడ పంచాయతీ కార్యాలయంలో… తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీపీ పాల్గొన్నారు, సర్పంచ్ జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ యొక్క విశిష్టతను వివరించారు, ఈ కార్యక్రమంలో పంచాయతీఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉమా,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు..
- తల్లాడ పోలీస్ స్టేషన్ లో… తల్లాడ పోలీస్ స్టేషన్ లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు, ఎస్సై సురేష్ జెండా ఆవిష్కరించారు అనంతరం ఇండిపెండెన్స్ డే యొక్క విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..
- తల్లాడ సొసైటీ కార్యాలయంలో…. తల్లాడ సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ వీర మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు చైర్మన్ వీర మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరించి,అనంతరం మిఠాయిలు పంచారు,ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యాలయ సిబ్బంది, సహసిబ్బంది పాల్గొన్నారు..
- తల్లాడ రైతు వేదికలో… రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్ అధ్యక్షతన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధ్యక్షులు వెంకట్ లాల్ జండా ఆవిష్కరించి కార్యక్రమాల యొక్క విశిష్టతను వివరించారు.ఈ కార్యక్రమంలో ఏవో తాజుద్దీన్,వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు…
- తల్లాడ రెవెన్యూ కార్యాలయంలో… తల్లాడ ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రవికుమార్ అధ్యక్షతన జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఎమ్మార్వో జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది,సహసిబ్బంది పాల్గొన్నారు.. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావుతో పాటు ఎమ్మార్వో రవికుమార్ ఎస్సై సురేష్,ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి,సొసైటీ చైర్మన్ వీరమోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, ఏవో తాజుద్దీన్,తెలంగాణ ఉద్యమ నాయకులు మోదుగు ఆశీర్వాదం,మాజీ ఎంపీపీ కాంపెల్లి రాము,బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు జివిఆర్,తేళ్ళూరి రఘు, పలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, సహా సిబ్బంది,పాల్గొన్నారు