
అనాధాశ్రమంలో అన్నదానం అభినందనీయం
వేడుకల పేరిట వృధా ఖర్చు చేయకుండా అనాధాశ్రమంలో పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొని అన్నదానం చేయడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. బుధవారం గూడపాటి నవీన్, అనన్యాల కుమారుడు లకిత్ జన్మదినోత్సవం సందర్భంగా అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ అనాధ ఆశ్రమంలో అనాధ పిల్లలు, మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గూడపాటి.నవీన్ అనన్యా దంపతులను ఆదర్శంగా తీసుకొని అనాధలకు చేయూతనిచ్చేందుకు ముందుకు రావాలన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవలందిస్తున్న శనగల జగన్మోహన్ ను ఈ సందర్భంగా వారు అభినందించారు. అనాధాశ్రమం నడిపిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.తప్పక శనగల రాధాకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట, బాల్ రెడ్డి,దొడ్డ సురేష్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు