
హస్సేన్ బి కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు
మండల పరిధిలో అన్నారుగూడెం గ్రామంలో షేక్ మౌలాన్ బి మాతృమూర్తి షేక్ హస్సేన్ బీ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బుధవారం ఆమె దశదిన కార్యక్రమం వారి స్వగృహంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు,ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోవెల కృష్ణయ్య,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుగ్గినేని సత్యనారాయణ, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు ఆ పార్టీ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ మదర్ సాహెబ్,యువజన నాయకులు జానీ,అక్బర్ పాషా,తదితరులు పాల్గొన్నారు. హస్సేన్ బీకి నివాళులర్పించిన సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ,సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు హాజరై హస్సేన్ బి కుటుంబాన్ని పరామర్శించారు.