రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో దీక్షను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రెడ్డి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర జిల్లాల మండలాల రెడ్డి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి గోపు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలలో గెలుపొందిన తదనంతరం రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు ఎలాంటి కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ తరుణంలో గత ఫిబ్రవరి మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిసి మంత్రి కేటీఆర్ కు మెమోరండం కూడా సమర్పించినట్లు ఆయన తెలిపారు. కచ్చితంగా రెడ్డి కార్పొరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటివరకు అది నెరవేర్చలేదని అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల సామాజిక వర్గం రెడ్డి వర్గాలకు ఎంతో న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులందరికీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని లేఖలు ఇచ్చిన సందర్భాలలో వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఇంతవరకు ఆచరణ యోగ్యం కాలేదని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమ న్యాయమైన డిమాండ్ ను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం రెడ్డి సంఘము వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పటిష్టమైన కార్యచరణ రూపొందించి రెడ్డి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబా దులో వేల మందితో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మండల, జిల్లాల స్థాయి నుండి అనేకమందిని తరలించి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. అనంతరం రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమం లో రెడ్డి సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు రెంటాల కేశవరెడ్డి, రావుల నరసింహారెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహారెడ్డి, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర కోశాధికారి పెండ్లి త్రివేణి రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మట్ట రాజశేఖర్ రెడ్డి, రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి వీరారెడ్డి, 64 డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి, డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ నరోత్తం రెడ్డి, బిజెపి రావు అమరేందర్ రెడ్డి, కామిడి సతీష్ రెడ్డి, రాధారపు సంజీవరెడ్డి , బిల్లా సుధీర్ రెడ్డి, జనగాం జిల్లా అధ్యక్షుడు లోకమంతరెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, మన్నెం ఇంద్రారెడ్డి, కూచన రవళిరెడ్డి, రాజిరెడ్డి, పులి వీరారెడ్డి, లెక్కల జలంధర్ రెడ్డి, కోయగూర వెంకట రంగారెడ్డి, వీసం రమణా రెడ్డి, జినుగు గోవర్ధన్ రెడ్డి, మాడుగుల పాపిరెడ్డి, దూదిపాల తిరుపతిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నల్ల సంతోష్ రెడ్డి, గంగిడి ప్రభాకర్ రెడ్డి, వనంరెడ్డి, అర్జుల కిషన్ రెడ్డి, పత్తి సంపత్ రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.