
మృతుని కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో సర్ధార్ సర్వాయి పాపన్న యూత్ కమిటీ సభ్యుడు రంగు శివ,కిరణ్ గౌడ్ తాత రంగు నర్సయ్య గత కొన్ని రోజుల క్రితం మృతి చెందగా శనివారం దశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సర్ధార్ సర్వాయి పాపన్న యూత్ అసోసియేషన్ కమిటీ సభసభ్యులు తమ వంతు సహాయంగా 100 కేజీ ల బియ్యం అందజేసి చేయూతనందించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.