
జఫర్ఘడ్ ఖబరస్ధాన్ ప్రహారీ గోడకు 2౦లక్షలు మంజూరు
జఫర్ఘడ్ మండల కేంద్రంలోని మైనార్టీ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో జాఫరగఢ్ జామా మసీదు కమిటీ సభ్యులు,ముస్లిం సోదరులు మాజీ డిప్యూటీ సీఎం,ఎమ్మెల్సీ కడియం శ్రీవారిని కలిసి జాఫరగఢ్ టౌన్ లో గల ఖబరస్థాన్ కు ప్రహరీ గోడ కావాలని కోరగా కడియం శ్రీహరి వెంటనే సీడీఫ్ నిధుల నుండి 20లక్షల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.అడగగానే స్పందించి నిధులు మంజూరు చేసినందుకు మసీదు కమిటీ సభ్యులు,ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు అఖిల్ మైనోద్దిన్,మహబూబ్ అలీ,దస్తగిరి,జాఫర్, అబ్బాస్ ఖాన్,షాన్ పాషా, ముక్తర్ హాలి,యాకుబ్ పాషా,బాబు,అజ్జు,ఆలిం, ఫాహిం ముస్లిం సోదరులు పాల్గొన్నారు.