
జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు
ఇటీవల అకాల మృతి చెందిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కు జర్నలిస్టులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేే (ఐజేయు) హనుమకొండ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ అద్యక్షతన జహీరుద్దీన్ అలీఖాన్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా ఫజల్ ఉర్ రహమాన్ వాజిద్ వ్యవహరించగా జహీరుద్దీన్ చిత్ర పటానికి జహీరుద్దీన్ కుటుంబ సభ్యులు, ప్రెస్ క్లబ్, టీయూడబ్ల్యూజేే నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమెర్ అలీఖాన్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం జహీరుద్దీన్ నిరంతరం తపించేవారని అన్నారు. ఆయన మృతి సామాజిక ఉద్యమాలకు, ప్రజాసంఘాలకు తీరని లోటు అన్నారు. టీయూడబ్ల్యూజేే రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మదు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి జహీరుద్దీన్ అలీఖాన్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన అకాల మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ శాంతి సంఘం అధ్యక్షులు డాక్టర్ అనీష్ సిద్దిఖీ, వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, జహీరుద్దీన్ అలీఖాన్ కుమారులు ఫకృద్దీన్ అలీఖాన్, అస్ఘర్ అలీఖాన్ , జర్నలిస్టు నాయకులు కంకణాల సంతోష్,డాక్టర్ పొడుశెట్టి విష్ణు వర్దన్, దండు మోహన్, పల్లె రామారావు,ఖాదర్ పాషా, వహీద్ గుల్షన్,ఎంఎ. నయీమ్, సయీద్, ఇస్మాయిల్ జబీ, శ్రీహరి రాజు, ఎండి. ఉస్మాన్ పాషా, తాండూరి గోపి రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు