తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నూతన కమిటీ ఎన్నిక
Hyderabadమేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం ప్రగతి నగర్ లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సాంబరాజు కుమార్ అధ్యక్షతన 20-8-2023 ఆదివారం ఏర్పాటు చేసిన సభకు నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్,జాతీయ ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక,రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నర్సిములు, రాష్ట్ర విద్యార్థి అధ్యక్షులు సిహెచ్. బస్వరాజ్,రాష్ట్ర యూత్ కార్యదర్శి కొండ్రాతి రమేష్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ రజకుల చిరకాల వాంఛ ఐన ఎస్సీ జాబితాలో చేర్చే విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అసెంబ్లీలో పార్లమెంట్ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు. ఎస్సీ జాబితాలో ఉన్న 17 రాష్ట్రాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉద్యోగాల్లో లబ్ధి పొందుతున్నారని మిగతా12 రాష్ట్రాలలో అందుకు బిన్నంగా ఉందన్నారు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే కులం ఒకే రిజర్వేషన్ ఉండాలి కానీ బిన్న రిజర్వేషన్లు ఉండటంచేత ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నాయని సమాజంలో అది మంచిది కాదని అబిప్రాయపడ్డారు. ప్రగతి నగర్ కాలనీ నూతన కమిటీ ఎన్నికల్లో బాగంగా ప్రగతినగర్ అధ్యక్షులుగా మటమ్ కన్నయ్య ,ఉపాధ్యక్షులుగా రావి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా అరవపల్లి గోవింద్ , కోశాధికారిగా కొండపల్లి అర్జున్ రావు , సంయుక్త కార్యదర్శిగా స్వయంబరపు లోవరాజు, కార్యవర్గ సభ్యులుగా కొండపల్లి వెంకటేష్, రావి చిన్నరావు ,కడ్జర దుర్గారావు, చల్లపల్లి సత్తిబాబు ఎన్నుకున్న సభ్యులకు జిల్లా అధ్యక్షులు సాంబరాజు కుమార్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో అప్పజెప్పిన భాధ్యతను సక్రమంగా జాతి శ్రేయస్సుకై అభ్యున్నతికై ఎస్సీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తామని అన్నారు. ఈ సభకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్డాల అప్పరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సైనవరపు కురుమూర్తి ,రాపర్తి అజయ్,శ్రీ దుర్గా భవానీ ప్రగతి నగర్ రజక సంఘం సభ్యులు తదితరులు హాజరయ్యారు.