
ఆర్థిక సాయం చేసిన బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ కార్యవర్గం
జనగామ జిల్లా, కొడకండ్ల మండలం కేంద్రం లో 2002 – 2003 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు అందరి కలిసి ఏర్పాటు చేసుకున్న బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్న నాటి మిత్రుడైన అంతోజు.కాశీనాదం తల్లి అంతోజు. చంద్రకళ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన కారణాన, ఇట్టి విషయాన్ని బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ సంస్థ అధ్యక్షులు శ్రీ పెద్దపూడి. ప్రసన్న కుమార్, ZPSS KKL SSC – 2003 అనే వాట్స్ ఆప్ గ్రూప్ లో పోస్ట్ చేయగా 32 మంది స్నేహితులు స్పందించి ఒక్క రెండు రోజుల వ్యవధిలోనే 22,500 రూపాయలను జమ చేసి, బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ అధ్యక్షులు , ప్రధాన కార్యదర్శి మేడుదుల అశోక్ , కోశాధికారి చెరుకు. సంధ్యారాణి, సహాయ కార్యదర్శి నర్మేట.మమత రాణి, ముఖ్య సలహా దారులు ఎస్కే. అక్బర్ , సభ్యులు ; పల్లె. సోమశేఖర్ గౌడ్, ఎండీ.రఫీక్, చేతుల మీదుగా స్నేహితుడు అంతోజూ. కాశీ నాదం కి అందించడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు శ్రీ గంటా. రవీందర్ కి తెలియజేయగా స్పందించి 2000 ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని చేయడం జరిగింది…మా స్నేహితుడు ఇబ్బందిలో ఉన్నాడు చిన్న సహాయం చేయండి అనగానే వెంటనే స్పందించి సహాయం చేసిన రవీందర్ సార్ కి 2003 పదవ తరగతి బ్యాచ్ మిత్రులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. స్నేహితుడు ఇబ్బందిలో ఉన్నాడు సహాయం చేయండి అనీ కోరగానే వెంటనే క్షణం ఆలోచించకుండా మిత్రులందరూ స్పందించి ఆర్థిక సాయం చేసినందుకు బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ కార్యవర్గం తరుపున మిత్రులందరికీ సంస్థ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలియజేశారు.