డోర్నకల్ గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం
Hyderabad, Mahabubabadహైదరాబాద్ లోని గాంధీభవన్ లో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చంద్రరెడ్డి ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న టీపి సిసిరాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్ మాలోత్ నెహ్రూ నాయక్
అనంతరం నెహ్రూ నాయక్ మాట్లాడుతూ టీపిసిసి ఆదేశానుసారం శాసన సభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు తమ బయోడేటాతో గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించగా డోర్నకల్ నియోజకవర్గం నుండి దరఖాస్తు చేశానన్నారు టిపీసీసీ అధిష్టానం పరిశీలించి తనకు టికెట్ ఇస్తే డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకువస్తానని అన్నారు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని,డోర్నకల్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యత, రాజకీయ ఆస్థిరతకు ఇక్కడి నాయకులే కారణమని, కనీస సౌకర్యం లేని గ్రామాలు, తండాలు ఎన్నో ఇంకా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎంత మంది టికెట్ ఆశీంచిన స్థానిక నాయకడిని నేనే కాబట్టి నాకే వస్తుంది ఆశాభావం వ్యక్తంచేశారు జిల్లా అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి ఆశీస్సులు నా పైన ఉన్నాయని గత పది సంవత్సరాల నుండి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటునానన్నరు సమాజమే నా దేవలయం ప్రజలే నా దేవుళ్ళు అని అన్నారు నూతనంగా నిర్మించే దేవాలయాలకు అందించానన్నారు నేను ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాలలో అడుగు పెట్టానని టీ పి సి సి అధిష్టానం.డోర్నకల్ నియోజక ప్రజలు ఆశీర్వాదిస్తే సేవ చేసే భాగ్యాన్ని కొరుకుంటానన్నారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు మెరుగు సత్యనారాయణ జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యాక్షులు గుగులోత్ లాలు నాయక్, కుంచం మహేష్,డోర్నకల్ నియోజకవర్గం నాయకులు మాలోత్ భూపాల్ సింగ్ మండల అధ్యక్షులు,గ్రామ అధ్యక్షులు,యూత్ అధ్యక్షులు,జిల్లా నాయకులు,మండల నాయకులు,యువజన నాయకులు సోషల్ మీడియా సభ్యులు,పార్టీ అభిమానులు,సీనియర్ నాయకులు,తది తరులు పాల్గొన్నారు