
అధికారుల నిర్లక్ష్యం వలన 1,90,000 నష్టం
38 మంది కుటుంబాలు మత్స్య కార్మిక సహకార సంఘం సభ్యులకు పెండింగ్లో ఉన్న ప్రమాద బీమా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ రావు కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే మల్లేశం మత్స్య కార్మిక సంఘం నాయకులు శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మత్స్యకారులకు సుమారు రెండు కోట్ల రూపాయలు ప్రమాద బీమా డబ్బులు నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యం 38 కుటుంబాలకు కడుపుకోత మిగిలించిందని అన్నారు పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్న మచ్చకారులకు న్యాయం జరగలేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు. స్పందించి జిల్లాలోని ప్రమాదంలో చనిపోయిన మత్స్యకారులకు ప్రమాద బీమా డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో 23 నాడు సీఎం సభలో ఆందోళన చేపడతామని అన్నారు . ఈ కార్యక్రమంలో ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు జై లింగం నగేష్ లలిత మీనాక్షి భాగ్యమ్మ సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.